శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్ర పరిశోధన సంబంధిత అంశాలను సోమవారం జరిగిన సమావేశంలో
కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు సమీక్షించారు.
గత నెల 17వ తేదీన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖా మంత్రి
కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన పరిశోధనా మండలి సమావేశం జరిగింది.
ఆ సమావేశంలో శ్రీశైల పరిశోధన సంబంధించి పలు ఆదేశాలు జారీ చేసారు.ఈ రోజు జరిగిన సమావేశంలో కార్యనిర్వహణాధికారి, ఆ ఆదేశానుసారం ఆయా పనుల ప్రగతిని సమీక్షించారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ తగు ఛాయాచిత్రాలతో శ్రీశైల
ప్రాకారకుడ్యం విశేషాలను వివరించే గ్రంథముద్రణను వీలైనంత త్వరలో చేపట్టాలన్నారు. అదేవిధంగా
సంస్కృతం, తెలుగు, కన్నడ, తమిళం, మరాఠి సాహిత్యాలలోని క్షేత్ర ప్రస్తావ అంశాలను తగు
విధంగా పరిశోధన చేసే చర్యలను వెంటనే చేపట్టాలన్నారు. ఘంటామఠంలో లభ్యమైన
శాసనాలను తగు వ్యాఖ్యానంతో ప్రచురించ తలపెట్టిన గ్రంథముద్రణ పనులను కూడా జనవరి
మాసంలోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కళావేదిక, మ్యూజియం, ఆధ్యాత్మిక గ్రంథాలయం, ఆర్జు గ్యాలరీ
మొదలైన వాటి నిర్మాణాలకు స్థల పరిశీలన చేపట్టి, తగు అంచనాలను రూపొందించాలని
ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
అదేవిధంగా క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉద్యాన
,పారిశుద్ధ్య విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు. క్షేత్రపరిధిలో విస్తతంగా మొక్కలు నాటేందుకు
ప్రణాళికలు రూపొందించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.ముఖ్యంగా శ్రీశైలక్షేత్రపరిధిలో గల అరుదైన వృక్ష జాతులను, బెషధమొక్కలను గుర్తించాలని
ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. ఈ విషయమై వృక్షశాస్త్ర నిపుణుల, ఆయుర్వేద వైద్యుల
అటవీశాఖ వారి సహాయ సహకారాలు అందించారన్నారు.
పాతాళగంగ పాతమెట్ల మార్గాన్ని మరమ్మతు చేసే విషయమై తగు నివేదికలు
రూపొందించి అందజేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు.
సమావేశానంతరం ఏనుగుల చెరువుకట్ట ప్రాంతాన్ని కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడి సుందరీకరణ పనుల ప్రతిపాదనను గురించి సంబంధిత అధికారులతో
చర్చించారు. భ్రమరాంబాసదన్ అతిథిగృంలో జరిగిన సమావేశములో పరిశోధనా రంగంలో
అనుభవం కలిగిన డా. వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆలయ , ధర్మప్రచారాల విభాగపు
సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, శ్రీశైలప్రభ సంపాదకులు డా. సి. అనిల్‌కుమార్,
పర్యవేక్షకులు బి. శ్రీనివాసులు, దేవస్థానం సహాయ స్థపతి ఐ.యు.వి. జవహర్‌లాల్, సంబంధిత
సిబ్బంది పాల్గొన్నారు.