శ్రీశైల క్షేత్ర పరిధి సరిహద్దులపై చర్చలు

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్ర పరిధి  సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించేందుకు తలపెట్టిన డి.జి.పి.ఎస్ సర్వేకు సంబంధించి బుధవారం  అటవీశాఖ అధికారులతో సమావేశం జరిగింది. బైర్లూటిలోని ఎకోటూరిజం సెంటర్ లో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశంలో శ్రీశైల క్షేత్ర పరిధి సరిహద్దులకు సంబంధించి ఆయా ప్రాథమిక అంశాలు చర్చించారు. మరో వారం రోజులలో జరిగే మలి సమావేశంలో ఈ సర్వేకు సంబంధించిన తదుపరి చర్యలు వుంటాయి.

 సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ఆత్మకూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసరు  అలన్ చోంగ్ తెరాన్, మార్కాపురం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్  విఘ్నేష్, శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్  నరసింహులు, సెక్షన్ ఆఫీసర్  జ్యోతిస్వరూప్ తదితర అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ హెచ్.జి. వెంకటేశ్, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.