
శ్రీశైల దేవస్థానం: కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రావణమాసోత్సవాలు నిర్వహించాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ కే ఎస్.రామరావు ఆదేశించారు. ఆగస్టు 9, శ్రావణ శుద్ధ పాడ్యమి నుండి సెప్టెంబరు 7, శ్రావణ అమావాస్య వరకు శ్రావణమాసోత్సవాలు నిర్వహిస్తారు.ఈ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు (28.07.2021) న కార్యనిర్వహణాధికారి కే ఎస్.రామరావు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
పరిపాలనా కార్యాలయం లోని సమావేశ భవనం లో నిర్వహించి న ఈ సమావేశం లో ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కోవిడ్ నిబంధనలు, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, పరిమిత సంఖ్యలో ఆర్జితసేవలు, భక్తులకు అన్నప్రసాద పొట్లాల వితరణ, క్యూకాంప్లెక్స్ లో అల్పాహార వితరణ, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా మొదలైన అంశాలపై చర్చించించారు.
కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ ముఖ్యంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ శ్రావణమాసోత్సవాలు నిర్వహించాలన్నారు.
ప్రతి ఒక్కరు కూడా మాస్కు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడం, భౌతికదూరం పాటించడంలాంటి అంశాలపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.ఉద్యోగులే కాకుండా స్థానికులు, యాత్రికులు కూడా తప్పనిసరిగా ముందుజాగ్రత్తలు పాటించే విధంగా అందరిలో అవగాహనను కల్పించాలన్నారు.
అదేవిధగా కల్యాణకట్ట, సేవాకౌంటర్లు, దర్శనక్యూలైన్లు, ప్రసాద విక్రయకేంద్రం మొదలైన అన్నిచోట్ల ఎటువంటి లోపం లేకుండా కోవిడ్ నిబంధనలు పాటించేవిధంగా పాటించేవిధంగా తగు చర్యలు చేపట్టాలన్నారు.
ముఖ్యంగా కరోనా వ్యాప్తి నివారణకై తీసుకోవలసిన ముందుజాగ్రత్తల గురించి దేవస్థాన ప్రసార వ్యవస్థ ద్వారా (మైక్ ద్వారా) నిరంతరం తెలియజేస్తుండాలని శ్రీశైలప్రభ సంపాదకుణ్ణి ఆదేశించారు.
ఈ ముందుజాగ్రత్త చర్యల గురించి క్షేత్రపరిధిలో మరిన్ని ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
శ్రావణమాసంలో శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, ఏకాదశులు, శ్రావణ పౌర్ణమి, మాసశివరాత్రి, ప్రభుత్వ సెలవురోజులలో భక్తులరద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఈ రద్దీ రోజులలో క్యూకాంప్లెక్స్ నందు మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు అందిస్తుండాలని అన్నదానవిభాగాన్ని ఆదేశించారు.
అదేవిధంగా పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలని, క్షేత్రపరిధిలోని ప్రధాన రహదారులు, అతిథిగృహాలు, కల్యాణకట్ట ప్రాంగణం, డార్మెటరీలు మొదలైనవాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
శుభ్రతాపరంగా ఎటువంటిలోపం లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. అవసరమైన అన్నిచోట్ల కూడా మరిన్ని చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలని సూచించారు.
శ్రావణంలో భక్తులు ఆలయాన్ని అధికంగా సందర్శించడంతో మంచినీటి సరఫరాలో ఎటువంటిలోపం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
భక్తుల సౌకర్యార్థమై శ్రావణ రెండవ శుక్రవారం (20.08.2021), శ్రావణ నాలగవ శుక్రవారం (03.09.2021) రోజులలో వరలక్షీవ్రతాన్ని పరోక్షసేవగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.