
శ్రీశైల దేవస్థానం: అనంతపురంలోని గాయత్రి మిల్క్ డేయిరి ప్రైవేటు లిమిటెడ్, వ్యవస్థాపకులైన పల్లి శ్రీనివాస్ రెడ్డి, కుటుంబసభ్యులు దేవస్థానం వైద్యశాలకు ఆదివారం వివిధ రకాలైన ఔషధాలను విరాళంగా అందజేశారు. కీ.శే. శ్రీమతి పల్లి లీలావతమ్మ జ్ఞాపకార్థం ఈ ఔషధాలను అందించారు
శ్రీ పాక శ్రీనివాసయాదవ్, హైదరాబాద్, కుటుంబసభ్యులు, చలాది భాస్కరరావు, మెడ్చెల్, మల్కాజ్ గిరి కూడా ఔషధాలను అందించారు.ఈ మేరకు కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్నకు వీటిని అందించారు.
జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, ఊపిరితిత్తుల వ్యాధులు, గ్యాస్ ట్రబుల్, ఇన్ఫెక్షన్లు మొదలైన వ్యాధులకు సంబంధించిన మందులను అందించారు.ఈ కార్యక్రమంలో వైద్యశాల విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి, వసతి విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, పర్యవేక్షకులు మధుసూదన్‌రెడ్డి, పి. వెంకటేశ్వర్లు, దేవస్థాన వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో డాక్టరు శ్యాంప్రసాద్ రెడ్డి, విశ్రాంత ల్యాబ్ టెక్నిషియన్ జి.రాఘవేంద్రుడు, సంబంధిత గుమాస్తా కె. శ్రీనివాసులు, సంబంధిత దేవస్థానం వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.