శ్రీశైల దేవస్థానం: రాజుగౌడ్ , ఎల్. సంధ్య హైదరాబాద్ వారు శనివారం
పలు రకాల మందులను దేవస్థానికి విరాళంగా అందజేశారు.
పలు రకాల మందులను దేవస్థానికి విరాళంగా అందజేశారు.జ్వరం, ఒళ్ళునొప్పులు, బలహీనత, షుగర్, బి.పి. మొదలైన వాటి నివారణ, ఎముకల బలానికి అవసరమైన ఔషధాలను వీరు అందించారు.
ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఈ ఔషధాల విలువ సుమారు రూ. 1.24 లక్షల దాకా ఉంటుందని తెలిపారు.
కాగా దాతలు ఈ ఔషధాలను పర్యవేక్షకులు యం. శ్రీనివాసరావుకు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
