దేవస్థానం వైద్యశాలకు విరాళంగా వైద్యపరికరాలు

 శ్రీశైల దేవస్థానం: ఇందుకూరి సిద్ధార్త్ రెడ్డి, హైదరాబాద్  శుక్రవారం  దేవస్థానం వైద్యశాలకు వైద్యపరికరాలను అందజేశారు. వివిధ  రక్తపరీక్షలకు సంబంధించిన హెమటాలజీ అన్లైజర్ పరికరాన్ని , మూత్ర పరీక్షలకు సంబంధించిన యూరిన్ కెమెస్ట్రీ ఆటోమేటేడ్ అన్లైజర్ పరికరాలను అందించారు. వీటి విలువు సుమారు రూ. 4 లక్షలని దాతలు తెలియజేశారు.

ఈ మేరకు ఆయా పరికరాలను కార్యనిర్వహణాధికారి  ఎం. శ్రీనివాసరావుకు అందించారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ దాతలు అధునాతన పరికరాలను అందజేయడం ద్వారా వైద్యశాలలో స్థానికులకు, యాత్రికులకు మరింత మెరుగైన సేవలు అందించే వీలు కల్పించారన్నారు. దాతలకు కార్యనిర్వహణాధికారి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో   ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు గంజిరవి, ఎం. శ్రీనివాసరావు, దేవస్థాన వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు, డా. సాయికిషన్, డా.సంఘమేష్ దేవస్థానం వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.