శ్రీశైల
దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు శనివారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు
మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి.
ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు ప్రత్యేకం.
మయూర వాహనసేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు మయూరవాహనసేవ ప్రత్యేకం.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం ప్రత్యేకం.
గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ప్రత్యేక ఆకర్షణ.
*శ్రీశైలం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన EO., J శ్యామలరావు దంపతులు.