మనోహరంగా మయూర వాహనసేవ
శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు మంగళవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. యాగశాలలో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు చేసారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు జరిగాయి.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి.
ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపారు.
:
ఈ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు మయూరవాహనసేవ ఘనంగా నిర్వహించారు.ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేసారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరిగింది. కోలాటం, చెక్కభజన, రాజబటులవేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు బీరప్పడోలు, చెంచునృత్యం, నందికోల సేవ, ఢమరుకం, చితడలు, శంఖం, పిల్లనగ్రోవి తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ప్రదర్శించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన కాణిపాక దేవస్థానం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం, కాణిపాకం వారు ఉదయం పట్టువస్త్రాలను సమర్పించారు.కాణిపాక దేవస్థానం తరుపున ఆ దేవస్థాన ధర్మకర్తలమండలి అధ్యక్షులు ఎ. మోహన్రెడ్డి, కార్యనిర్వహణాధికారిఎ. వెంకటేశు పట్టువస్త్రాలను సమర్పించారు.
కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, వేదపండితులు, శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు.తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు చేసారు.అనంతరం కాణిపాక దేవస్థాన అధికారులు, అర్చకులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేసారు.ఈ కార్యక్రమంలో ఆ దేవస్థానం పర్యవేక్షకులు కె. కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆ దేవస్థానం ధర్మకర్తలమండలి అధ్యక్షులు ఎ. మోహన్రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాలలో స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
*తిరుమల తిరుపతి దేవస్థానముల వారు పట్టువస్త్రాలు సమర్పించారు:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
• పట్టువస్త్రాలను సమర్పించిన తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారి సతీమణి శ్రీమతి వై.స్వర్ణలతారెడ్డి , తిరుమల తిరుపతి దేవస్థానముల జాయింట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ జె. వీరబ్రహ్మం దంపతులు
• కార్యక్రమములో పాల్గొన్న తిరుమల తిరుపతి దేవస్థానముల వేదపండితులు.
*నిహల్, బృందం, హైదరాబాద్ వారు సంగీత విభావరి సమర్పించారు.
*Bhukailasam Drama Performed By M.Siva Shankarachari & team
*కల్యాణకట్ట, డార్మిటరీలు, లడ్డు విక్రయ కేంద్రాలను పరిశీలించిన కార్యనిర్వహణాధికారి లవన్న
*అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాద వితరణపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్న ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి
*చంద్రవతి కల్యాణ మండపాన్ని పరిశీలించిన దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు
*30 పడకల తాత్కాలిక ఆసుపత్రిని పరిశీలించిన కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న
*నిత్య కళారాధన వద్ద 3వ సాంస్కృతిక కార్యక్రమం
*Pathalaganga Punya Nadhi snaanaalu
,
Post Comment