కోవిడ్ నివారణకు మాస్కు రక్షణ కవచం

*”మాస్కె కవచం” పోస్టర్ రిలీజ్ చేసిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు*

కర్నూలు, సెప్టెంబర్ 13:-కోవిడ్ నివారణకు మాస్కె రక్షణ కవచంలాంటిదని ప్రతి ఒక్కరూ తప్పక మాస్కు ధరించాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.
సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో “మాస్కెకవచం” అనే పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో అన్ని వేళలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు.
నేను నా కుటుంబం నా సందర్శకులు కోవిడ్ బారినపడకుండా క్షేమంగా ఉండాలంటే మాస్కులు ధరించడం అత్యవసరం. మీరు టీకా తీసుకున్నప్పటికీ తప్పక మాస్కు ధరించండి.
మాస్క్ లేకపోతే ప్రవేశం లేదు.
అనే పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ , రైతు భరోసా)రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా మనజీర్ జిలానీ సామూన్(జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు, డిఆర్ ఓ పుల్లయ్య, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డి ఆర్ డి ఏ పి డి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రామ గిడ్డయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed