శ్రీశైల దేవస్థానం:లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపుల కేటాయింపునకు ఈ రోజు (24.12.2021) న చంద్రవతి కల్యాణ మండపంలో డిప్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తేది:21.10.2021న వెలువరించిన తీర్పును, భారత సర్వోన్నత న్యాయస్థానం తేది : 17.12.2021న వెలువరించిన తీర్పు అనుసరించి ఈ డిప్ నిర్వహించారు.
దుకాణాల కేటాయింపునకు నిర్వహించిన ఈ డిప్ లో ఈ రోజు మొత్తం 53 మంది డిస్ ప్లేసుడు టెనెంట్స్ పాల్గొన్నారు.
కాగా కొందరు దుకాణదారులు లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపులకు దేవస్థానం నిర్ణయించిన నెలసరి అద్దె అధికంగా ఉందని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయమై బుధవారం రోజున ( 29.12.2021) తీర్పు వెలువడనున్నది.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వెలువరించనున్న ఈ తీర్పును అనుసరించి ఈ దుకాణముల కేటాయింపుపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ ఓ తెలిపారు.
గతం లో , 2019 సంవత్సరం ఆగస్టు లో లలితాబింకా షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలకు నిర్వహించిన బహిరంగవేలం లో పాల్గొన్న దుకాణదారులలో కొందరు ఉన్నత న్యాయస్థానం లో వ్యాజ్యమును దాఖలు చేసారు.
ఈ విషయమై ఉన్నతన్యాయస్థానం తీర్పు అనుసరించి బహిరంగవేలం లో హెచ్చు పాటను పాడిన 42 మంది పిటిషనర్లలో 39 మందికి డిసెండింగ్ ఆర్డరు ప్రకారంగా షాపు అద్దెలను కూడా ఈ రోజు (24.12.2021) తెలిపారు.
ఈ విషయం లో కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం బుధవారం ( 29.12.2021) వెలువరించనున్న తీర్పు ఆధారంగా తదుపరి చర్యలువుంటాయి.
ఈరోజు జరిగిన డిప్ నిర్వహణకు స్థానిక పోలీస్ అధికారులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసారు.
కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యములో జరిగిన ఈ డిప్ లో స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్ వెంకటరమణ, సహాయ కమిషనర్( ఇంఛార్జి) మరియు సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు. నరసింహారెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకుడు డా.సి.అనిల్ కుమార్, పర్యవేక్షకులు డి.రాధకృష్ణ, బి, మల్లికార్జునరెడ్డి, ఎస్. శ్రీహరి, కె.శివప్రసాద్,బి. శ్రీనివాసులు పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.