శ్రీశైల దేవస్థానం: ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్
నెంబరు అందుబాటులోకి తెచ్చింది. ఆయా పౌరసేవలను సమర్థవంతంగా, వేగంగా, అందుబాటులోకి వచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో పొందవచ్చును.
ఈ వాట్సాప్ “మనమిత్ర” పేరుతో పిలువబడుతోంది.పారదర్శకంగా అందించేందుకు పౌరులు మొత్తం 161 సేవలను పొందవచ్చును.
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో ఆలయ దర్శనం టికెట్లను, ఆర్జిత సేవాటికెట్లను కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. భక్తులు నిర్ణీత రుసుము చెల్లించి ఈ సేవా టికెట్లను పొందవచ్చు.
95523 00009 నెంబరును తమ చరవాణిలో నమోదు చేసుకొని, ఆ నంబరునకు హెచ్.ఐ. అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేసి పంపడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
మనమిత్ర వాట్సాప్ ద్వారా శ్రీశైల దేవస్థానం లో శ్రీ స్వామి వారి స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చు.
అదేవిధంగా శ్రీ స్వామివారి ఆర్జిత గర్బాలయ అభిషేకం, ఆర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరభ్యాసం మొదలైన 17 ఆర్జితసేవలకు సంబంధించిన సేవాటికెట్లు కూడా ఈ వాట్సాప్ ద్వారా పొందవచ్చును.
భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా దేవస్థానం కోరింది.