
శ్రీశైలదేవస్థానం: శ్రీశైల మల్లికార్జునస్వామివారి పరమ భక్తులలో ఒకరైన మల్లమ్మ వారి జయంత్యోత్సవం సంప్రదాయరీతిలో జరిగింది.గోశాల సమీపంలో హేమారెడ్డి మల్లమ్మ ( మల్లమ్మకన్నీరు) మందిరంలో సోమవారం మల్లమ్మవారికి పంచామృత అభిషేకం, జలాభిషేకం తదితర విశేషపూజలు జరిపారు. ముందుగా జయంత్యోత్సవ సంకల్పం పఠించారు.తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ అనంతరం స్తోత్ర పారాయణలతో మల్లమ్మవారికి అభిషేకం, అర్చన జరిపారు.చివరగా మల్లమ్మను స్తుతిస్తూ పలు భక్తి గీతాలు ఆలపించారు.కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ఆధ్వర్యములో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి జి.ఎమ్. విజయలక్ష్మీసుబ్బరాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
*Sahasra deeparchana seva, Vendi Rathotsava Seva performed in the temple. E.O. and others participated in the events. Archaka swaamulu performed the puuja events.
* Smt.Vadlamudi Sarojini,Hyderabad, W/0 Late Ramesh Babu Vadlamudi donated Rs.10 lakhs for Kutira Nirmana Pathakam (Ganesh Sadhanam)
*Totakura Srinivasa Raju, Hyderabad donated Rs.1,01,116 for Go samrakshana Nidhi In The Memory Of Totakura Satyanarayana Raju
*Madi Ram Reddy, Moinabad, Ranga Reddy District donated Rs.1,00,000 for Go samrakshana Nidhi.