
శ్రీశైలదేవస్థానం: శ్రీశైల మల్లికార్జునుని పరమ భక్తులలో ఒకరైన మల్లమ్మ వారి జయంత్యోత్సవం వైశాఖ పౌర్ణమి సందర్భంగా దేవస్థానం గోశాల సమీపంలో ని హేమారెడ్డి మల్లమ్మ మందిరంలో ఈ రోజు (26.05.2021) న సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లమ్మవారికి పంచామృత అభిషేకం,జలాభిషేకం తదితర విశేష పూజలు చేసారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఈ ప్రత్యేక పూజలను చేసారు.
ఈ విశేష కార్యక్రమంలో భాగంగా ముందుగా జయంత్యోత్సవ సంకల్పం పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ అనంతరం స్తోత్ర పారాయణలతో మల్లమ్మవారికి అభిషేకం, అర్చన చేసారు.
ఈ జయంతి కార్యక్రమం లో భాగంగానే మల్లమ్మ మందిరం లో విశేషంగా ఉమామహేశ్వరపూజా కార్యక్రమం కూడా జరిగింది.
కాగా ఈ కార్యక్రమానికి ముందుగా మల్లమ్మవారికి కార్యనిర్వహణాధికారి కే. ఎస్.రామ రావు నూతన వస్త్రాలను, పసుపుకుంకుమలను సమర్పించారు.
శ్రీశైల మల్లికార్జునస్వామివారి పరమ భక్తులలో మల్లమ్మ ఒకరు. మల్లమ్మ తల్లిదండ్రులు వీరశైవ సంప్రదాయపరాయుడైనందువలన మల్లమ్మకు బాల్యం నుండే మల్లికార్జునస్వామి వారిపై భక్తి అలవడింది. మల్లమ్మతల్లిదండ్రులకు సంతానం లేని కారణంగా సంతానం కోసమై వారు మల్లికార్జునస్వామి వారిని సేవించారు. ఒకనాడు మల్లికార్జునస్వామి వారికి కలలో కనిపించి వారికి కుమార్తె కలుగుతుందని, ఆమె వలన వారి వంశం చరితార్థం అవుతుందని చెప్పాడు.
యుక్త వయస్సు రాగానే మల్లమ్మకు తల్లిదండ్రులు వివాహం జరిపిస్తారు. మల్లమ్మ అత్తవారింట అడుగు పెట్టిన వేళావిశేషంతో వారి ఆస్తిపాస్తులు ఎంతగానో పెరుగుతాయి. మల్లమ్మ సహృదయం కారణంగా అందరు కూడా మల్లమ్మను గురించి గొప్పగా చెప్పుకుంటారు.
దాంతో మల్లమ్మ తోటికోడలు, ఆమె అత్తగారు మల్లమ్మను ఎన్నో కష్టాలు కలిగిస్తారు. అయినప్పటికి ఎప్పటికప్పుడు మల్లికార్జున స్వామివారు ఆమె కష్టాలను పరిహరిపంజేస్తుంటాడు.
చివరకు చెప్పుడు మాటలు విని మల్లమ్మ భర్త మల్లమ్మ మెడను నరకబోతాడు. అప్పుడు మల్లికార్జునస్వామి వారి మహిమతో వెంటనే అతని చేతిలోని కత్తి రెండు ముక్కలవుతుంది.
దాంతో వాస్తవాన్ని తెలుసుకున్న భర్త, కుటుంబ సభ్యులు మల్లమ్మను మన్నించమని వేడుకుంటారు.
అయినప్పటికి లౌకిక జీవితంపై విరక్తి కలిగిన మల్లమ్మ వైరాగ్యంతో కుటుంబాన్నంతా వదిలివేసి శ్రీశైలక్షేత్రానికి విచ్చేసి స్వామివారిని సేవిస్తూ, క్షేత్రానికి విచ్చేసే భక్తులకు శివతత్తాన్ని బోధిస్తూ చివరకు శివసాయుజ్యం పొందిందని ప్రతీతి.
*Donation of Medicines By Srisaila Bhaktha Seva Samithi, Tenali To Devasthanam Hospital (Worth of Rs.86,799/-).
*Donation of One Lakh For Gosamrakshana Nidhi By Sri Katta Nagaraju , Krishna District
*Sakthi Ganapathi Abhishekam ,Uyala Seva ,Pallaki Seva performed in the temple.Archaka swaamulu performed the events in temple norms.