×

వచ్చే వారంలోగా జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల పురోగతి తప్పనిసరి-కలెక్టర్ పి.కోటేశ్వరరావు

వచ్చే వారంలోగా జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల పురోగతి తప్పనిసరి-కలెక్టర్ పి.కోటేశ్వరరావు

కర్నూలు, సెప్టెంబర్ 15:-ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో పురోగతి కనిపించాలని, ఇప్పటికి మూడు సార్లు సమీక్ష నిర్వహించామని, వచ్చే వారంలో జరగబోయే సమీక్షలో పురోగతి సాధించకపోతే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని అట్టి వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను హెచ్చరించారు.

బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు – జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణాలు పురోగతి పై ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గ స్థాయి అధికారులతో  జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, ఆదోని ఆర్ డి ఓ రామకృష్ణారెడ్డి, హౌసింగ్ పిడి వెంకటనారాయణ, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం సోమశేఖర్ రెడ్డి, డ్వామా పిడి అమర్నాద్ రెడ్డి, డిఆర్ డిఏ పిడి వెంకటేశులు, మండల స్పెషల్ ఆఫీసర్ లు, తహశీల్దార్ లు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ….ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒకటిన్నర సంవత్సరం క్రితం నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం తీసుకొచ్చిందని, కింద స్థాయిలో ఆశించినంత మేరకు ఇంకా పనులు మొదలు పెట్టలేదని జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్ ఇంజనీర్లు, మండల ఆఫీసర్ లు సమన్వయంతో టీమ్ గా పనిచేసి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్లు హౌసింగ్ ప్రోగ్రాం పై వారంలో ఒకరోజు సంబంధిత ఇంజనీర్లతో సమీక్షలు నిర్వహించాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం సంబంధించి ఇళ్ల నిర్మాణాలలో పనితీరు మెరుగు పడాలని, పురోగతి సాధించకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హౌసింగ్ శాఖ ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక ప్రకారం ప్రతివారం గ్రౌండింగ్ చేపట్టాలని, గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్ లు లక్ష్యానికి అనుగుణంగా ఇళ్ల గ్రౌండింగ్ పూర్తిచేయాలన్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న 36,242 ఇళ్ళు వెంటనే పనులు మొదలు పెట్టాలని హౌసింగ్ ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

print

Post Comment

You May Have Missed