
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఎస్.లవన్న ఈ రోజు లడ్డు, పులిహోర ప్రసాద తయారీ కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు.రోజువారి ప్రసాదాల తయారీ, ఎప్పటికప్పుడు విక్రయ కేంద్రాలకు పంపబడుతున్న స్టాకు నమోదు, ఇండెంట్ల నమోదు మొదలైనవాటిని పరిశీలించారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీలో విధిగా శుచిశుభ్రతలను పాటిస్తుండాలని సంబంధికులను ఆదేశించారు. ఏ మాత్రం కూడా నాణ్యత తగ్గకుండా వుండేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలన్నారు.భక్తులు కోరినన్ని లడ్డుప్రసాదాలు ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన మేరకు లడ్డు ప్రసాదాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.ముఖ్యంగా శని,ఆది,సోమవారాలు, ప్రభుత్వపు సెలవురోజులు, పర్వదినాలలో భక్తులరద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. భక్తులరద్దీకనుగుణంగా అవసరమైన మేరకు ప్రసాదాల తయారీ ఉండాలన్నారు.
ప్రసాదాల విక్రయ కేంద్రాల క్యూలైన్లలో భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా త్వరితగతిగా ప్రసాదాలను అందజేస్తుండాలని సిబ్బందికి సూచించారు.
*Pallaki seva held in the temple.E.O. participated in the event.
*Dr.Krishna Kumar, IAS, Chief Administrator Sri Jagannath Temple, Puri & Amitabh Thakur, IPS, Govt of Odisha visited the temple.E.O., Archaka swaamulu honoured with temple maryaadha.