శ్రీశైల దేవస్థానం:
• చంద్రగ్రహణం కారణంగా ఉదయం గం. 6.00ల నుండి ఆలయ ద్వారాలు మూసివేత.
• రాత్రి గం. 7.30లకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పూజాదికాలు
• రాత్రి గం. 9.00లకు శ్రీస్వామిఅమ్మవార్లకు మహా మంగళహారతులు

మంగళవారం చంద్రగ్రహణం కారణంగా ఉదయం గం. 6.00ల నుండి ఆలయ ద్వారాలు మూసివేసారు.
తిరిగి రాత్రి గం. 7.30లకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి గం.9.00లకు శ్రీ స్వామిఅమ్మవార్ల మహా మంగళ హారతులు జరిగాయి. అవకాశం మేరకు మహామంగళహారతుల సమయం నుంచే రాత్రి గం.9.00ల నుండి రాత్రి గం. 10.00ల వరకు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీఅమ్మవారి దర్శనం కల్పించారు.
ఈ రోజు ఉదయం గం. 3.00లకు ఆలయ ద్వారాలు తెరచి మంగళ వాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత: కాలపూజలు, మహామంగళహారతులు జరిపించారు. మహామంగళ హారతులు సమయం నుంచే గం. 4. 30ల నుంచి గం. 5.30 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించారు.
గ్రహణం కారణంగా ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు , సాక్షి గణపతి, హాఠకేశ్వరం – ఫాలధార పంచధార , శిఖరేశ్వరం మొదలైన ఉపాలయాల ద్వారాలు కూడా మూసివేసారు.
గ్రహణం కారణంగా ఈ రోజు అన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేసారు.
