ఉప ప్రధానార్చకులు  ఎం. సుబ్రహ్మణ్యం పదవీ విరమణ

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం అమ్మవారి ఆలయంలో  ఉప ప్రధానార్చకులు   ఎం. సుబ్రహ్మణ్యం ఈ రోజు (30.09.2021)న  వయసు రీత్యా ఉద్యోగ విరమణ చేసారు.

 ఎం.సుబ్రహ్మణ్యం మే, 1987లో దేవస్థానంలో నియామకాన్ని పొందారు. మొత్తం 34 సంవత్సరాలకు పైగా వీరు దేవస్థానంలో విధులను నిర్వహించారు.

కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న అధ్యక్షతన  జరిగిన  సమావేశం లో పలువురు వక్తలు ప్రసంగించారు.  ఎం. సుబ్రహ్మణ్యం సేవలను కొనియాడారు.అనంతరం కార్యనిర్వహణాధికారి వీరికి శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు,  జ్ఞాపికను అందజేశారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.