లోకాయుక్త కార్యాలయం కోసం భవనాలు పరిశీలించిన లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి

*ఈ రోజు (07-08-2021)న  కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ కు విచ్చేసిన లోకాయుక్త  జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి. మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసిన ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ,  రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి , కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కే.బాలాజీ. లోకాయుక్త  జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి  సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పాల్గొన్న డిఆర్ఓ పుల్లయ్య, ఆర్ అండ్ బి ఎస్ ఈ జయరాం రెడ్డి, కర్నూలు రూరల్ తహసీల్దార్ వెంకటేష్ నాయక్, తదితరులు.

కర్నూలు, ఆగస్టు 7 :-కర్నూలులో లోకాయుక్త కార్యాలయం భవనాల ఏర్పాటుకు శనివారం ఉదయం  భవనాలను లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

లోకాయుక్త కార్యాలయం భవనం పరిశీలనకు కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డిని స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ,  రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కే.బాలాజీలు స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

అంతకుమునుపు లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం లోకాయుక్త భవన కార్యాలయం కోసం కర్నూలు- హైదరాబాద్ జాతీయ రహదారి ఆనుకొని ఉన్న సంతోష్ నగర్ లో భవనాన్ని క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. తదనంతరం బళ్లారి చౌరస్తా డి మార్ట్ వెనక వైపున రాగ మయూరి ప్రైడ్ భవనంలోని ఒకటి , రెండు అంతస్తుల్లో భవనాలను ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కే.బాలాజీలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో లోకాయుక్త కార్యాలయం ఏర్పాటుపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తో భేటీ అయి పలు అంశాలపై ఆయన చర్చించారు.

డిఆర్ఓ పుల్లయ్య, ఆర్ అండ్ బి ఎస్ ఈ జయరాం రెడ్డి, కర్నూలు రూరల్ తహసీల్దార్ వెంకటేష్ నాయక్, ఆర్ అండ్ బి డి ఈ, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed