అక్టోబరు 20న పరోక్షసేవగా లక్షకుంకుమార్చన
శ్రీశైల దేవస్థానం:ప్రతీ నెలలో పౌర్ణమి రోజున శ్రీ భ్రమరాంబాదేవివారికి భక్తులు పరోక్ష ఆర్జిత సేవగా లక్షకుంకుమార్చన జరిపించుకునే అవకాశం కల్పించారు.
ప్రతీ నెలలో పౌర్ణమి రోజున ఈ లక్షకుంకుమార్చనను జరిపించుకోవచ్చు.
ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6.30గంటల నుంచి ఈ లక్షకుంకుమార్చన పరోక్షసేవగా నిర్వహిస్తారు.
ఈ పరోక్ష ఆర్జితసేవకు భక్తులు ఆన్ లైన్ ద్వారా రూ.1,116/-లను సేవా రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
భక్తులు సేవా రుసుమును www.srisailadevasthanam.org లేదా http: //aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
ఈ లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంసారంవృద్ధిలోకి వస్తుందని, సంతాన సౌఖ్యం కలుగుతుందని, పూర్వ జన్మదోషాలు తొలగిపోతాయని పండితులు పేర్కొంటారన్నారు.
కాగా శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకునేందుకువీలుగా దేవస్థానం ఈ ఆర్జితపరోక్షసేవలను ప్రారంభించింది.
భక్తులందరు కూడా ఈ పరోక్షసేవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.
ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351/ 52 | 53/54/ 55/56 లను సంప్రదించవచ్చును.
Post Comment