×

లక్షణంగా లక్షదీపోత్సవం

లక్షణంగా లక్షదీపోత్సవం

శ్రీశైల దవస్థానం: కార్తీక మొదటి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు.
• భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లు.
• మూడు క్యూలైన్ల ద్వారా దర్శనం ఏర్పాట్లు.
• క్యూలైన్లలో నిరంతరం మంచినీరు,అల్పాహారం అందజేత.
•  సాయంకాలం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం – పుష్కరిణిహారతి.

*ఈ ఓ , అధికార గణం , సిబ్బంది పర్యవేక్షణ.

*హోర్డింగ్ ఆవిష్కరణ:

స్థానిక ఆర్టిసి బస్టాండు వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన సమాచార హోర్డింగును  ఏపి.ఎస్. ఆర్.టి.సి చైర్మన్  ఎ. మల్లికార్జునరెడ్డి ఆవిష్కరించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైల క్షేత్ర ప్రాశస్త్యం, దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య ఆర్జిత సేవలు, పరోక్ష ఆర్జిత సేవలు, ఇటీవల ప్రవేశపెట్టిన ఉదయాస్తమానసేవ – ప్రదోషకాలసేవ పూజా వివరాలు, ఆన్లైన్ చెల్లింపు వివరాలు, శ్రీశైలప్రభ చెల్లింపు వివరాలు, దేవస్థాన సమాచార ఫోను నెంబర్లు తదితర సమాచారాన్ని ఈ హోర్డింగులో పొందపరిచారు.

ఈ సందర్భంగా రాష్ట్రములోని వివిధ ప్రధాన నగరాలు, పట్టణాలు మొదలైన చోట్ల ఆయా ఆర్టిసి బస్టాండులలో దాతల సహకారంతో దేవస్థాన సమాచార హోర్డింగును ఏర్పాటు చేయవలసినదిగా కోరుతూ ఆర్టిసి చైర్మెన్ఎ. మల్లికార్జునరెడ్డి కి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న అభ్యర్థన లేఖను ఇచ్చారు.ఇందుకు స్పందనగా  పలు ఆర్టిసి బస్టాండులలో దేవస్థాన సమాచార హోర్డింగులను ఏర్పాటుకు తగు చర్యలు ఉంటాయని  ఆర్టిసి. చైర్మెన్  పేర్కొన్నారు. ఆర్టిసి నంద్యాల డిస్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ఆఫీసరు శ్రీనివాసులు, ఆత్మకూరు డిపో మేనేజరు జి. మహేంద్రుడు, శ్రీశైలం బస్టాండు స్టేషన్ మేనేజరు కె. మధుకుమార్, స్థానిక ఆర్‌టిసి సిబ్బంది పాల్గొన్నారు.

 దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి.రామకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారులు ఐ.ఎన్.వి మోహన్, ఎం. హరిదాసు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఐ(సి) చంద్రశేఖరశాస్త్రి, అసిస్టెంట్ ఇంజనీర్లు భవన్ కుమార్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

*NADA NEERAJANAM IN PUSHKARINI attraction.

*కళారాధనలో సంప్రదాయ నృత్యం.

print

Post Comment

You May Have Missed