శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (23.07.2021)న శ్రీభ్రమరాంబాదేవివారికి భక్తులు పరోక్షఆర్జితసేవగా లక్షకుంకుమార్చన చేసారని ఈ ఓ కే ఎస్.రామరావు తెలిపారు.ఈ రోజు సాయంకాలం సమయానికి పౌర్ణమి ఘడియలు ఉండడంతో లక్ష కుంకుమార్చనను నిర్వహించారు.
మొత్తం 721 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా నేవారుసుమును చెల్లించి ఈ పరోక్షసేవను జరిపించుకున్నారు.
ఒకే పరోక్షసేవలో యింత ఎక్కువ మంది భక్తులు పాల్గొనడం ఇ దే మొదటిసారి కావడం విశేషం.
గత మాసం పౌర్ణమినాటి నుంచి లక్షకుంకుమార్చనను పరోక్షసేవగా జరుపుతున్నారు.
కాగా ఈ రోజు సాయంకాలం గం.5.30నుండి ఈ లక్షకుంకుమార్చన జరిపారు.
లక్షకుంకుమార్చనలో ముందుగా పూజాసంకల్పాన్ని పఠించి తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను, అనంతరం లక్షకుంకుమార్చన చేసారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ గత సంవత్సరం ఏప్రియల్ మాసములో ప్రారంభించిన పరోక్షసేవను దేవదాయశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రస్తుతం మరింతగా విస్తరింపజేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇందులో భాగంగానే పౌర్ణమినాటి లక్షకుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవ విధానం లో పాల్గొనే అవకాశం కల్పించామనారు. లక్షకుంకుమార్చన పరోక్షసేవకు భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన లభించిందన్నారు.
మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యం వుందని తెలిపారు. ఈ కుంకుమ ద్రవ్యముతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పేర్కొన్నారు.ఈ లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంసారం వృద్ధిలోకి వస్తుందని, సంతాన సౌఖ్యం కలుగుతుందని, పూర్వజన్మదోషాలు తొలగిపోతాయని పండితులు పేర్కొంటారన్నారు.
కాగా శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈ ఆర్జితపరోక్షసేవలను ప్రారంభించింది.
భక్తులందరు కూడా ఈ పరోక్షసేవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.
ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351/52 | 53 / 54/55/56 లను సంప్రదించవచ్చును.
