*కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు .
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా)రామసుందర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపు రెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, డిఆర్ ఓ పుల్లయ్య, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డి అర్ డి ఏ పీ డి వెంకటేశులు, నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.*
కర్నూలు డిసెంబర్ 6:-వ్యవస్థ పట్ల నమ్మకం కలిగేలా స్పందన దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను మనసు పెట్టి పరిష్కారం చూపాలన్నారు . స్పందన కు సంబంధించి గడువు దాటిన దరఖాస్తులు 34 ఉన్నాయని, ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించినట్లయితే బియాండ్ ఎస్ ఎల్ ఎ అర్జీలు ఉండవన్నారు. అర్జీదారులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్య పరిష్కారం అవుతుందా లేదా స్పష్టంగా అర్జీదారునికి అర్థం అయ్యే విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాలను విజిట్ చేసినప్పుడు ముఖ్యంగా స్పందన అర్జీల రిపోర్ట్ ను పరిశీలించడం జరుగుతుందన్నారు.
ఒమిక్రాన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మన జిల్లాకు వచ్చే వ్యక్తుల వివరాలు సేకరించి వారిని 15 రోజులపాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు.
అధికారులందరూ నెలలో రెండుసార్లు మధ్యాహ్న భోజన పథకాన్ని విజిట్ చేసి పిల్లలతో పాటు భోజనం చేయాలన్నారు. అధికారులు వెళ్లడం వల్ల విద్యార్థులకు ఇంకా మెరుగ్గా భోజనం అందుతుందన్నారు. విద్యార్థులను క్యూలైన్లో నిలబెట్టి భోజనం పెట్టరాదన్నారు. విద్యార్థులను ఒక హాల్లో కూర్చోబెట్టి భోజనం వడ్డించాలని కలెక్టర్ ఆదేశించారు..విద్యార్థులను పేర్లతోనే పిలవాలన్నారు..
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. కొంతమందికి ఈ పథకంపై అవగాహన లేదని జిల్లాలో అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా)రామసుందర్ రెడ్డి,
జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపు రెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, డిఆర్ ఓ పుల్లయ్య, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డి అర్ డి ఏ పీ డి వెంకటేశులు, నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు