రైతులకు అవగాహన కల్పించాలి- కలెక్టర్ జి.వీరపాండియన్
*వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంలో భాగంగా భూరికార్డుల స్వచ్చీకరణ అంశంపై రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి.వీర పాండియన్.పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి ,డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ పుల్లయ్య, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవోలు రామకృష్ణారెడ్డి, హరి ప్రసాద్, వెంకటనారాయణమ్మ తదితరులు.*
కర్నూలు, జూన్ 11 :వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రీ సర్వేను చాలా సీరియస్ గా తీసుకుని క్షేత్రస్థాయిలో జరిగే రీ సర్వేను నిశితంగా క్వాలిటీ చెక్ చేయాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్ డిఓలకుఆదేశించారు.
శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకంలో భాగంగా భూరికార్డుల స్వచ్చీకరణ అంశంపై ఆర్డీఓ లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సర్వే శాఖ, రెవిన్యూ శాఖ అధికారులకు ఓరియంటేషన్ నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి ,డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ పుల్లయ్య, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓలు రామకృష్ణారెడ్డి, హరి ప్రసాద్, వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిపిఓ ప్రభాకర్ రావ్, డిఆర్డిఎ పిడి వెంకటేశులు, సర్వే శాఖ ఏడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ వంద సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు.. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం రీ సర్వే ద్వారా రైతుల భూములకు శాశ్వత భూ హక్కు రికార్డు కల్పిస్తూ భూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు..భూ రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్ సర్వే చేయించి, వైయస్సార్ జగనన్న భూ రక్షా హద్దు రాళ్లు నాటి తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు పరిష్కారం జరుగుతుందన్నారు. ఫీల్డ్ లెవెల్లో ఎక్కడైతే సర్వే చేస్తున్నారో ఆ పట్టా భూమి లోని రైతులతో సమావేశం నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, రెవెన్యూ, సర్వే శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
Post Comment