×

కూచిపూడి నృత్య ప్రదర్శన

కూచిపూడి నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం  నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం  దాలిపర్తి దుర్గా నరసింహారావు, చల్లపల్లి వారు  కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద   సాయంకాలం నుండి  కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం లో మహాగణపతిం, గరుడగమన తవ, శివాష్టకం, శివశివ భవభవ, శంభోమహాదేవ, చంద్రశేఖరాష్టకం, అర్ధనారీశ్వరం, భో… శంభో తదితర గీతాలకు, అష్టకాలకు చైత్ర, తన్మయి, చరిత, హర్షవర్ధిని తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.

print

Post Comment

You May Have Missed