
శ్రీశైల దేవస్థానం: కార్తీకమాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీశైలదేవస్థానం , జాతీయ సాంస్కృతిక పరిశోధన , శిక్షణా సంస్థ (National Cultural Research and Training centre), దక్షిణ ప్రాంతీయ కేంద్రం, బెంగళూరు సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్నారు. మరికొన్ని కార్యక్రమాలు దేవస్థానం పక్షాన ఏర్పాటు అయ్యాయి.
శుక్రవారం N.C.R.T వారి సౌజన్యంతో ప్రఖ్యాత నాట్యకళాకారులు డా. పిల్లి జాహ్నవి , వారి బృందం, బిక్కవోలు కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.ఈ కార్యక్రమములో జి. నాగలోహిత, కె. నిఖిత, పి. వెంకట్, జె. శ్రీజ, కె. లలిత తదితరులు ఆయా అంశాలకు నృత్య ప్రదర్శనను చేసారు .