జులై 24వ తేదీన సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరు కార్యాలయాన్ని
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అదే రోజున జిల్లా ఎస్పీ
కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. వీటితో పాటు, మెడికల్
కాలేజీ భవనాన్ని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను సిఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం
సూర్యాపేటలో బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సిఎం కేసీఆర్
పాల్గొంటారు.