
Hyderabad,Nov3,2022: Chief Minister K Chandrashekhar Rao expressed condolences on the
demise of senior journalists G.S.VaradhaChary, Kancharla Lakshmareddy (KL Reddy, 91). Chief Minister K Chandrashekhar Rao expressed condolences on the
passing away of senior journalist GS Varadachari. CM KCR said that Varadachari,
who hailed from Nizamabad district, extended service to journalism over four
decades. The Chief Minister conveyed his deep sympathies to the bereaved family
members.
Chief Minister K Chandrashekhar Rao expressed condolences on the
demise of senior journalist Kancharla Lakshmareddy (KL Reddy, 91). CM KCR
remembered the selfless services rendered to the press field and lived a modest
life by KL Reddy, who hailed from the erstwhile Nalgonda district. The Chief
Minister expressed his deep sympathies to the bereaved family members and
relatives.
……………………
*ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరు పాత్రికేయ ప్రముఖులను కోల్పోయిన దురదృష్టకర సందర్భం ఇది . నిన్న వరంగల్లులో దివంగ తులైన కే.ఎల్. రెడ్డి గురించి పాత్రికేయ ప్రముఖులు రామచంద్ర మూర్తి whatsup లో రాసిన విశ్లేషణాత్మక వ్యాసం చదివితే ఆయన ఎంత నిజాయితీ,నిబద్దత కలిగిన పాత్రికేయ రత్నమో అవగతమౌతుంది. ఇక వరదాచారి మెయిన్ స్ట్రీమ్ జర్నలిజానికి – ఫిల్మ్ జర్నలిజానికి మధ్య వారధిగా నిలిచిన ప్రముఖులు,సహృదయులు, సౌమ్యులు. ఆ ఇద్దరు ఆదర్శ పాత్రికేయుల ఆత్మ శాంతిని కోరుకుందాం… వారి ఘనత నుండి స్ఫూర్తి పొందుదాం-Prabhu,Journalist.
*సీనియర్ జర్నలిస్టు కె. ఎల్. రెడ్డి గురువారం తెల్లవారుజామున వరంగల్లులో కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. నల్లగొండ జిల్లా పరసాయపల్లెకు చెందిన కంచర్ల లక్ష్మారెడ్డి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వరంగల్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 1950లో ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన కె.ఎల్.రెడ్డి సూర్యదేవర రాజ్యలక్ష్మి నిర్వహించిన తెలుగు దేశం రాజకీయ వారపత్రికతో తన సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, నేటి నిజం, సాయంకాలం, మహానగర్ – ఇలా కె.ఎల్. రెడ్డి తెలుగులో వెలువడిన పలు పత్రికల్లో పని చేశారు. తెలంగాణ ప్రభ పేరుతో వారపత్రికను, కాలేజీ విద్యార్థి పేరుతో మంత్లీని స్వయంగా నడిపారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో “నేడు” పేరుతో మూడు నెలలపాటు ఒక కరపత్రాన్ని వెలువరించారు. తెలంగాణ ఉద్యమ వార్తలను ఇందులో ప్రముఖంగా ప్రచురించేవారు. అయితే వార్తాపత్రికల రిజిస్ట్రార్ అనుమతి లేకుండా పత్రిక స్థాయిలో “నేడు”ను వెలువరించడం నేరంగా పరిగణించి కె. ఎల్. రెడ్డికి నెల రోజులపాటు కఠిన కారగార శిక్ష విధించారు. ముషీరాదాబ్ జైలులో ఆయన ఇతర ఖైదీలతో పాటు ఈ శిక్ష అనుభవించారు. ప్రత్యేక తెలంగాణ కోసం అక్షరాలనే ఆయుధాలుగా చేసుకున్న కె.ఎల్. రెడ్డి, జైలు శిక్షకు వెరవలేదు. తెలంగాణ అక్షర యోధుడు పేరిట కె.ఎల్. రెడ్డి గురించి గోవిందరాజు చక్రధర్ ఆంధ్రభూమిలో రాసిన ప్రత్యేక కథనం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని ఆకర్షించింది.
కె.ఎల్. రెడ్డి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ అందించారు. తెలుగు పత్రికా భాషపై పుస్తకం రాసిన కె.ఎల్. రెడ్డి నమ్మిన విషయాల్లో ఎక్కడా రాజీ పడేవారు కాదు. ముక్కసూటిగా మాట్లాడేవారు.కె.ఎల్. రెడ్డి మరణం పట్ల సంపాదకులు ఎం.విఆర్. శాస్త్రి, సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ మాడభూషి శ్రీధర్, గోవిందరాజు చక్రధర్ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కె. ఎల్. రెడ్డితో తమ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. కె.ఎల్. రెడ్డి మృతి పట్ల వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేశవరావు, ఉపాధ్యక్షులు ఉడయవర్లు, కార్యదర్శి కొండా లక్ష్మణరావు సంతాపం ప్రకటించారు.
సీనియర్ జర్నలిస్టు వరదా చారి మృతికి అల్లం నారాయణ సంతాపం
——————————
సీనియర్ జర్నలిస్టు వరదా చారి కి మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ నివాళి అర్పించారు.
ప్రముఖ జర్నలిస్ట్ వరదా చారి, 1956 ఒక తెలుగు దిన పత్రికలో సబ్ ఎడిటర్‌గా తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. 1961లో ఆంధ్ర భూమి దిన పత్రికలో న్యూస్ ఎడిటర్ గా చేరి 22 సంవత్సరాలు పనిచేసారు. ప్రముఖ దిన పత్రిక ఈనాడు లో అసిస్టెంట్ ఎడిటర్ గా 1983లో చేరారు. తెలుగు విశ్వావిద్యాలయం తో పాటు అనేక యూనివర్సిటీ లలో ఆయన జర్నలిజం బోధించారు. అన్ని ప్రముఖ దిన పత్రికల జర్నలిజం కళాశాలలో అయన బోధించేవారు.
ఉమ్మడి రాష్ట్రం లో ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతులలో ‘పత్రికల భాష ‘ అంశం పై ఆయన బోధించిన విషయం గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
*onlinenewsdiary.com extends tributes to G.S.VaradhaChary, Kancharla LakshmaReddy.