
శ్రీశైలదేవస్థానం:కార్తిక మొదటి సోమవారం సందర్భంగా రేపు (08.11.2021) పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సం , పుష్కరిణి హారతిని నిర్వహిస్తోంది. లోకకల్యాణం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు వుంటాయి.
లక్షదీపోత్సవం:
ఈ దీపోత్సవ కార్యక్రమంలో పుష్కరిణి ప్రాంగణమంతా కూడా దీపాలను ఏర్పాటు చేసారు.
పుష్కరిణి హారతి (దశవిధ హారతులు):
రేపు సాయంత్రం (08.11.2021) గం. 6.30ల నుండి ముందుగా శ్రీస్వామి అమ్మవార్లకు , పుష్కరిణికి దశవిధ హారతులు ఇస్తారు.
కాగా ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి విశేషంగా పూజాదికాలు చేస్తారు . అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను ఇస్తారు.
ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి,నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి సమర్పిస్తారు.
*Arrangements for Karthika Deepalu at Uttara Mada Veedhi.