శ్రీశైల దేవస్థానం: భక్తులు అనేకులు ఈ రోజు (21.11.2021 )న కార్తిక దీపారాధనలను చేసుకున్నారు.
ఉత్తర మాడవీధిలో ,శ్రీ కృష్ణదేవరాయ గోపురము ఎదురుగా గంగాధర మండపంవద్ద కార్తిక దీపారాధనను చేసారు .
ఈ రోజు ఉదయం నుండే భక్తులు కార్తిక దీపారాధనలను చేసుకోవడం కనిపించింది. కొందరు భక్తులు లక్షవత్తుల నోములను కూడా నోచుకున్నారు.
భక్తుల సౌకర్యార్థం వేడిపాల వితరణ చేసారు. అదేవిధంగా క్యూకాంప్లెక్స్లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు , మంచినీరు అందించారు.ఈ రోజు వేకువజామున దర్శనాలు ప్రారంభమైనప్పటి నుండే భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేసారు. రాత్రివేళ సర్వదర్శనం ముగిసేంతవరకు భక్తులకు ఈ ఉచిత ప్రసాద వితరణ చేస్తున్నారు. కార్తికమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు కూడా అన్నదాన మందిరంలో ఉదయం 10.30గంటల నుండి మధ్యాహ్నం 3.30గంటల వరకు కూడా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు.కార్తిక మాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేసారు. మొత్తం 9 కౌంటర్ల ద్వారా ఈ లడ్డు ప్రసాదాలు విక్రయిస్తున్నారు.
* Justice. R. Devdas. Judge,High Court of Karnataka State visited today. officials received with temple maryaadha.