శ్రీశైల దేవస్థానం:కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారు మంగళవారం సాయంకాలం ఆలయాన్ని సందర్శించి శ్రీ స్వామి అమ్మవార్లను సేవించారు.
సాయంకాలం ఆలయానికి చేరుకున్న పీఠాధిపతి వారికి ఆలయ రాజగోపురం వద్ద దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు.
ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి ఎం. విజయలక్ష్మీ శ్రీమతి వి. రామేశ్వరి, శ్రీమతి ఎ. లక్ష్మీసావిత్రమ్మ, ఓ. మధుసూదన్రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు తదితరులు కూడా స్వాగతం పలికారు.
తరువాత పీఠాధిపతులు స్వామివారికి అభిషేకాన్ని జరిపించుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.