×

ఉచిత సామూహిక సేవలలో శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం

ఉచిత సామూహిక సేవలలో శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం

 శ్రీశైల దేవస్థానం:ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానం  గురువారం  ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత సామూహిక సేవలలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవాన్ని నిర్వహించింది.

తెల్లరేషన్కార్డు కలిగిన వారి సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉచిత సామూహిక సేవలలో భాగంగా  చంద్రవతి కల్యాణ మండపంలో ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.  ఈ ఉచితసేవకు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న భక్తులచేత ఈ రోజు ఉదయం సామూహిక కల్యాణోత్సవాన్ని జరిపించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు.కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీస్వామివార్ల దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనానంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.సేవాకర్తలకు 2 లడ్డు ప్రసాదాలు, కైలాసకంకణాలు అందించారు.

దర్శనానంతరం భక్తులందరికీ దేవస్థానం అన్నపూర్ణ భవనం లో  భోజన సదుపాయం కూడా కల్పించారు.

సామూహిక కల్యాణోత్సవంలో స్థానికులే కాకుండా మార్కాపురం, చిత్తూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed