×

యర్రగొండపాలెం మండలం, కొలుకుల లో శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం

యర్రగొండపాలెం మండలం, కొలుకుల లో శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం

శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేవస్థానం ఈ రోజు (25.03.2021) న  ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని కొలుకుల గ్రామంలో శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించింది.

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ కార్యక్రమం  జరిగింది.

భక్తులలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేసి వారిలో ఆధ్యాత్మిక చింతనను కలిగించేందుకు,  హైందవ ధర్మపరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని, కొలుకుల గ్రామంలో  ఏర్పాటు చేసిన  కల్యాణోత్సవంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేబుచేయించి అర్చకస్వాములు కల్యాణోత్సవ సంకల్పాన్ని తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ చేసారు. అనంతరం స్థలశుద్ధి కోసం,  అభ్యుదయాన్ని కాంక్షిస్తూ పుణ్యాహవచనంచేసారు.

తరువాత కంకణపూజ, యజ్ఞోపవీత పూజ చేసి స్వామివారికి కంకణధార, యజ్ఞోపవీతధారణ జరిపారు. అనంతరం సప్త ఋషుల ప్రార్థన చేసి కన్యావరణ మంత్రాలను . తరువాత స్వామివారికి వరపూజను చేసారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రవర పఠనాన్ని చేసారు.

తరువాత స్వామివారికి మధుపర్కం సమర్పించి  తరువాత శ్రీ స్వామి అమ్మవార్లకు వస్త్రాలను , బాషి క ధారణ చేసారు. ఆ తరువాత గౌరీపూజ , స్వామి అమ్మవార్ల మధ్య తెరసెల్లను ఏర్పరచి మహాసంకల్పం పఠనం చేసారు . అనంతరం సుముహూర్త సమయంలో స్వామి అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు. ఆ తరువాత మాంగల్యపూజను జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ చేసారు. తరువాత తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తలకు తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనాన్ని అందించారు.ఈ ధర్మప్రచార కార్యక్రమం లో పలువురు అర్చకస్వాములు , సిబ్బంది పాల్గొన్నారు.

*  A.Rama Krishna,Dhone, Kurnool District, donated Rs.1,00,116 For Go Samrakshana Nidhi on the name of Sree Maha Yogi Sri Rama Chandra Malik Baba.

print

Post Comment

You May Have Missed