శ్రీశైల దేవస్థానం: స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. మహాశివరాత్రి గం.12.00 లకు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా ప్రారంభమైంది.
కనుల పండువగా ఈ కల్యాణోత్సవంలో స్వామివారు పట్టువస్తాన్ని ధరించి, తలపై ఒకవైపు
గంగమ్మను, మరొకవైపు నెలవంకను, మెడలో అభరణాలు, నుదుట విభూతి రేఖలను, పట్టువస్త్రాలను ధరించి
పెండ్లికుమారుడుగా ముస్తాబు అయ్యారు.
అమ్మవారు కూడా పట్టువస్త్రాలను ధరించి, నుదుట కల్యాణ తిలకాన్ని, బుగ్గన చుక్కను,
సర్వాభరణాలను ధరించి పెండ్లికుమార్తె అయి స్వామికి సరిజోడనిపించనున్నారు. మంగళతూర్యనాదాలతో,
వేదమంత్రాల నడుమ నేత్రానందంగా ఈ కల్యాణోత్సవం చూడ ముచ్చట. .
ఈ కల్యాణోత్సవంలో లోకకల్యాణాన్నికాంక్షిస్తూ ముందుగా అర్చకస్వాములు కల్యాణోత్సవ సంకల్పాన్ని
తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ జరిపారు. ఆ తరువాత
వృద్ధి అభ్యుదయాల కోసం పుణ్యహవచనం చేశారు.
తరువాత కంకణపూజను . అనంతరం యజ్ఞోపవీతపూజ చేసి స్వామివారికి కంకణధార,
యజ్ఞోపవీతధారణ ఆకర్షణ. అనంతరం సప్త బుషుల ప్రార్థన చేసి కన్యావరణ మంత్రాలను .ఆ
తరువాత స్వామివారికి వరపూజను , అనంతరం స్వామిఅమ్మవార్ల ప్రవర పఠనం ప్రత్యేకం.
స్వామివారికి మధువర్కం , శ్రీస్వామిఅమ్మవార్లకు వస్త్రాలను
సమర్పించడం ఆకర్షణ. తరువాత భాషికధారణ ఆ తరువాత గౌరీపూజ
ప్రత్యేకం.
స్వామిఅమ్మవార్ల మధ్య తెర సెల్లను ఏర్పరచి మహాసంకల్ప పఠనం అనంతరం
సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం , ఆ తరువాత మాంగల్యపూజను
జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ ప్రత్యేకం . తరువాత తలంబ్రాలు, బ్రహ్మముడి
కార్యక్రమాలను జరిపి భక్తులకు ఆశీర్వచనం ఈ వేడుకలో స్పెషల్.
*శివ నామస్మరణతో మార్మోగిన శ్రీశైల క్షేత్రం
*అశేష భక్తజన వాహిని మధ్య భక్తిశ్రద్ధలతో పాగాలంకరణ, లింగోద్భవ మహన్యాస రుద్రాభిషేకం
రమణీయం…కమనీయం… నయనానందకరంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వేడుకలకు హాజరైన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, శ్రీశైలం ఎమ్మెల్యే
శ్రీశైలం/నంద్యాల, ఫిబ్రవరి 26:-
శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామివారికి పాగాలంకరణ ఘనంగా ముగిసింది. బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలమహాక్షేత్రంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లింగోద్భవం సమయంలో చీరాల వాస్తవ్యులు పృధ్వి ఎంతో నిష్టతో భక్తిశ్రద్ధలతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున అమ్మ వార్లను తలుచుకుంటూ స్వామివారికి పాగా చుట్టి అలంకరించారు. రోజుకు మూర చొప్పున నేత నేస్తూ 365 రోజులు పాటు తయారు చేసిన పాగాను స్వామివారికి సమర్పించి ఆలయ సాంప్రదాయబద్ధంగా పాగాను అలంకరించారు. ఈ పాగాలంకరణ ఘట్టం దాదాపు గంటన్నర పాటు జరిగింది. ఈ ఘట్టంలో భక్తులు శివనామస్మరణతో శ్రీశైల మహా పుణ్యక్షేత్రం మారుమోగింది.
అనంతరం రమణీయం… కమనీయం గా నయనానందకరంగా నాగలకట్ట సమీపంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కల్యాణ తంతు వైభవోపేతంగా సాంప్రదాయ రీతిలో జరిగింది. అశేష భక్త జనవాహిని మధ్య కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి.
ఈ ఉత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైల దేవస్థానం బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.