శ్రీశైల దేవస్థానం:సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అయిదో రోజు మంగళవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపారు. యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోకకల్యాణం కోసం చతుర్వేద పారాయణలు, జపాలు, రుద్రపారాయణ చేసారు.తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారంగా జరిగాయి.
ఈ సాయంకాలం ప్రదోష కాలపూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు చేసారు.
కైలాస వాహన సేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు కైలాస వాహనసేవ నిర్వహించారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో కైలాసవాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు.తరువాత పురవీధులలో గ్రామోత్సవం జరిగింది. గ్రామోత్సవంలో జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.
బుధవారం కార్యక్రమాలు:
మకరసంక్రాంతి సందర్భంగా 17న ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాత:కాల పూజల అనంతరం ఉదయం గం. 9.00ల నుండి శ్రీస్వామివారి యాగశాలలో పూర్ణాహుతి అవబృదం, కలశోద్వాసన, వసంతోత్సవం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, విశేషార్చనలు జరుగుతాయి.
సాయంత్రం గం.6.00ల నుండి సదస్యమ్, నాగవల్లి, రాత్రి గం. 7.00లకు ధ్వజావరోహణ కార్యక్రమాలు జరుగుతాయి