×

కార్తీక శని,ఆది,సోమవారాలలో స్వామివార్ల స్పర్శదర్శనం నిలుపుదల

కార్తీక శని,ఆది,సోమవారాలలో స్వామివార్ల స్పర్శదర్శనం నిలుపుదల

శ్రీశైల దేవస్థానం: *నవంబరు 14న ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు డిసెంబరు 12న  ముగింపు *

  • ఈ నెల 26న పుణ్య నదీహారతి, జ్వాలాతోరణం , లక్షదీపోత్సవం- పుష్కరిణిహారతి*

27వ తేదీన సోమవారం సందర్భంగా లక్షదీపోత్సవం- పుష్కరిణిహారతి**

రద్దీరోజులలో స్వామివార్ల స్పర్శదర్శనం నిలుపుదల చేసి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం*

సాధారణ రోజులలో నిర్ధిష్టవేళలో నాలుగు విడుతలుగా స్వామివార్ల స్పర్శదర్శనానికి అవకాశం*

  • స్పర్శదర్శనం ఇతర ఆర్జితసేవాటికెట్లు ఆన్లైన్లో అందుబాటు. టికెట్ల లభ్యతను బట్టి గంట ముందు వరకు కూడా ఆన్లైన్ లో పొందే అవకాశం
  • కార్తీకమాసం మొత్తం గర్భాలయ అభిషేకములు , సామూహిక అభిషేకములు రద్దు

నవంబరు 14వ తేదీన కార్తీక మాసోత్సవాలు ప్రారంభమ్యాయి. భక్తుల సౌకర్యార్థం ఈ మాసోత్సవాల నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల విక్రయం, అన్నప్రసాదాల వితరణ, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి పలు ఏర్పాట్లు జరిగాయి.

ఈ నెల 26, ఆదివారంనాటి మధ్యాహ్నానికే పౌర్ణమి ఘడియలు రావడంతోనూ మరియు ఆ మరుసటి రోజైన సోమవారం రోజున మధ్యాహ్నం వరకు మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉన్న కారణంగా సంప్రదాయాన్ని అనుసరించి ఆదివారం రోజుననే అనగా 26వ తేదీ సాయంకాలం పాతాళగంగ వద్ద పుణ్యనదీహారతి, ఆలయ ప్రధానద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం , పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం – పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అదేవిధంగా 27వ తేదీ సోమవారం రోజున సాయంకాలం లక్షదీపోత్సవం- పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

దర్శన ఏర్పాట్లు :

కార్తికమాస పర్వదినాలు , సెలవు రోజులలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ కారణంగా భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీక మాసమంతా కూడా గర్భాలయ అభిషేకాలు , సామూహిక ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేసారు

అదేవిధంగా కార్తీకమాస రద్దీరోజులలో అనగా శని, ఆది, సోమవారాలు మొదలైన రోజులు (  మొత్తం 13 రోజులు) స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేసారు.

ఈ నెల 25 ( శనివారం), 26 ( ఆదివారం), 27 (సోమవారం) తేదీలలో భక్తులకు శ్రీస్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. ఈ రోజులలో స్వామివార్ల స్పర్శదర్శనానికి అవకాశం ఉండదు.

 కార్తికమాస సాధారణ రోజులలో రోజుకు నాలుగు విడతలుగా స్పర్శదర్శనం కల్పించబడుతుంది. భక్తులు ఈ స్పర్శదర్శనం టికెట్లను ఆన్లైన్లో మాత్రమే పొందవలసివుంటుంది.

ఇప్పటికే నవంబరు నెల టికెట్ల కోటాను దేవస్థానం వెబ్సైట్ లో  అందుబాటులో ఉంచారు. టికెట్ల లభ్యతను బట్టి ప్రారంభ సమయానికి కంటే ఒక గంట ముందు వరకు కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లను పొందే అవకాశం కల్పించారు.

దేవస్థానం వెబ్ సైట్

‘www.srisailadevasthanam.org’ ద్వారా ఆయా టికెట్లను ముందస్తుగా పొందవచ్చు. అదేవిధంగా గూగుల్ స్టోరు లో  “srisaila devasthanam” మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కూడా టికెట్లను పొందవచ్చు.

శీఘ్రదర్శనం – అతిశీఘ్రదర్శనం టికెట్లు :

రూ. 150/-ల రుసుముతో గల శీఘ్రదర్శనం ( శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే) మరియు రూ. 300/-ల రుసుముతో గల అతిశీఘ్రదర్శనం టికెట్లను (శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే) ఆన్లైన్ పాటు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా పొందవచ్చు. ఈ టికెట్లలో 30శాతం టికెట్లు ఆన్లైన్లోలో , తక్కిన 70 శాతం టికెట్లు కరెంట్ బుకింగ్ ద్వారా ఇస్తున్నారు.

 శని, ఆది, సోమవారాలలో రూ. 500/-ల దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్లను భక్తులు ఆన్లైన్ తోపాటు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా పొందవచ్చు. అయితే ఈ రూ.500/-ల టికెట్లకు కూడా కేవలం స్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.

కార్తీకమాసంలో ఉచిత సర్వదర్శనం కూడా యథావిధిగా కొనసాగుతుంది.  భక్తులందరు కూడా  సహకరించవలసిందిగా దేవస్థానం  కోరింది.

*Uyala seva, Nandeeswara Pooja Paroksha seva, Ankalamma Vishesha Pooja performed in the temple.

*వెండిహారతి బహూకరణ*

*

print

Post Comment

You May Have Missed