
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమంలో ఈరోజు (16.12.2021) కె. సుధాకర్, కర్నూలు బృందం మృదంగ లయ విన్యాస కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:00 ని||ల నుండి మృదంగ లయ విన్యాస కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో వాతాపి గణపతిం, శంభో… శివశంబో, శివశివశంకర, మహేశ్వరాయ, బ్రహ్మమురారి, ఓం హర శంకర, శంకర నాద.. తదితర గీతాలను సమర్పించారు.
ఈ కార్యక్రమానికి మృదంగ సహకారాన్ని కె. సుధాకర్, కీబోర్డు సహకారాన్ని వై. మహేష్, తబల సహకారాన్ని ఎం.
బాలకృష్ణ అందించారు.
రేపటి నిత్య కళారాధన,
రేపు (17.12.2021) బి. గీతాంజలి, కర్నూలు బృందంచే భక్తిరంజని కార్యక్రమం వుంటుంది.