శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్రంలో ఈ నెల 22 నుండి మార్చి 4 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రముఖులను ఆహ్వానించారు.శుక్రవారం విజయవాడలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు లను కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందజేసి, ఉత్సవాలకు ఆహ్వానించారు.దేవదాయశాఖ
ముఖ్యకార్యదర్శి డా.జి.వాణీ మోహన్, దేవదాయ కమిషనర్ డా. ఎం.హరిజవహర్ లాల్ లను కూడా కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు.
కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఆదేశాల మేరకు ఈ రోజు స్వామివారి ఉప ప్రధాన అర్చకులు శివప్రసాద్, ఆలయ పర్యవేక్షకులు రవి కుమార్ తదితరులు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ని ఉత్సవాలకు ఆహ్వానించారు.
*Inviting of Sameer Sharma , IAS,Chief Secretary Government of AP.