శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వరకు వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.ఈ ఉత్సవాలకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.సోమవారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివారావు, వేదపండితులు కలిసి రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి , నంద్యాల జిల్లా ఇంఛార్జి మంత్రి పి. కేశవ్ ను , రోడ్లు , భవనాలశాఖ మంత్రి బి.సి. జనార్థన్ రెడ్డి ని కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారికి స్వామివార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు.