
శ్రీశైల దేవస్థానం:ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కుంభాభిషేక మహోత్సవానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.
ఇందులో భాగంగా విజయవాడలో ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖా మంత్రి సత్యనారాయణని మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించారు. సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, అర్చకస్వాములు, వేదపండితులు పాల్గొన్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె. జవహర్ రెడ్డి ని మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించారు.
దేవదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, అర్చకస్వాములు, వేదపండితులు పాల్గొన్నారు.
విశాఖశారదాపీఠాధిపతి వారికి ఆహ్వానం:
విశాఖ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ని మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించారు.అలాగే విశాఖ శ్రీశారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీస్వామివారిని కూడా మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించారు. దేవదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, వేదపండితులు పాల్గొన్నారు.