శ్రీశైల దేవస్థానం: శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీ ఎం ను ఆహ్వానించారు.
సోమవారం ముఖ్యమంత్రి నివాసంలో సీఎం నారా చంద్రబాబునాయుడు ని కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి ని కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం తరుపున ఆహ్వానించారు.
ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపిక అందించారు.