శ్రీశైల దేవస్థానం: ధర్మకర్తల మండలి సభ్యులు మేరజిత్ హనుమంత్ నాయక్, శ్రీమతి బరుగు రెడ్డి పద్మజ ,ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు మంగళవారం గణేశసదనము నిర్మాణాన్ని పరిశీలించారు.టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో భక్తుల వసతి కోసం 220 గదుల సముదాయముగా గణేశ సదనముగా నిర్మిస్తున్నారు.
మొత్తం 220 గదులతో నాలుగు బ్లాకులుగా నిర్మిస్తున్న ఈ సముదాయంలో ఎ బ్లాక్ లో 36 గదులు, 8 షూట్లు, బి బ్లాకులో 64 గదులు, సి బ్లాకులో 48 గదులు, డి బ్లాకులో 64 గదులు నిర్మించారు.ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యులు ,ప్రత్యేక ఆహ్వానితులు మాట్లాడుతూ త్వరలో ఫినిషింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు.సముదాయ ప్రాంగణములో నాలుగువైపులా సీసీరోడ్లు, అదేవిధంగా నిర్మాణం చుట్టూ ప్రహరీగోడ తదితర నిర్మాణ పనులను కూడా వెంటనే ప్రారంభించాలని సూచించారు. పచ్చదనం కోసం ల్యాండ్ స్కేపింగ్ పనులను చేపట్టాలన్నారు.వసతి సముదాయ ప్రాంగణానికి సమీపంలోనే వీలైనంత మేరకు పార్కింగ్ ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని కూడా సూచించారు