శ్రీశైలదేవస్థానం: ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంతనాయక్, శ్రీమతి బి. పద్మజ, దేవస్థానం గోసంరక్షణశాలను, నందికేశసదనము డార్మెటరీ సముదాయాన్ని మొదలైన వాటిని పరిశీలించారు.వారు మాట్లాడుతూ గోశాలలో అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలని సూచించారు. అవసరం మేరకు గోశాలలో గోవులు నీటిని తాగేందుకు వీలుగా మరిన్ని నీటితొట్లను ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలన్నారు. గోశాల సంరక్షణశాల వెలుపలి భాగములో అవసరమైన చోట్ల గ్రావెల్ తో చదును చేయాలని పేర్కొన్నారు.తరువాత వారు గో సంరక్షణశాల వద్ద గల విభూతి తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.
అనంతరం పాతాళగంగమార్గములోని నందికేశసదనము డార్మెటరీల ప్రాంగణములో నిర్మిస్తున్న అదనపు శౌచాలయాల నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ సముదాయంలో అవసరం మేరకు వాటర్ ట్యాంకు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి.రామకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.