నాణ్యతగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలి- ధర్మకర్తల మండలి

 శ్రీశైల దేవస్థానం: ధర్మకర్తలమండలి సభ్యులు ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. శుక్రవారం  సాయంత్రం ధర్మకర్తలమండలి సభ్యులు  మేరాజోత్ హనుమంతనాయక్, శ్రీమతి బి. పద్మజ, ప్రత్యేక ఆహ్వానితులు  తన్నీరు ధర్మరాజు పలు ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. వీరు శ్రీలలితాంబికా వాణిజ్య సముదాయం వద్ద నిర్మిస్తున్న దుకాణాలు, గణేశ సదనం నిర్మాణపు పనులను, మల్లమ్మ కన్నీరు వద్ద ప్రతిపాదిత పార్కింగ్ స్థలం మొదలైనవాటిని పరిశీలించారు. పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి.రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

 ధర్మకర్తల మండలి వారు మాట్లాడుతూ లలితాంబికా  కాంప్లెక్స్ లో నూతనంగా నిర్మిస్తున్న 36 దుకాణాల పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  నిర్మాణములో నాణ్యతను పాటించాలన్నారు.అనంతరం గణేశ సముదాయాన్ని పరిశీలించారు. గణేశ సదనములో మిగిలిన ఉన్న ఫినిషింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.  పచ్చదనం కోసం ల్యాండ్ స్కేపింగ్ పనులను కూడా వెంటనే చేపట్టాలన్నారు.తరువాత మల్లమ్మకన్నీరు మందిరం వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రతిపాదిత ప్రదేశాన్ని పరిశీలించారు.

print

Post Comment

You May Have Missed