ఈ నెల 24వ తేదీకంతా ఏర్పాట్లను పూర్తి చేయాలి -ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ఉగాది ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం  కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న  సంబంధిత అధికారులతో కలిసి క్యూలైన్లను, క్యూ కాంప్లెక్స్ ను పరిశీలించారు.  మార్చి 30 నుండి ఏప్రియల్ 3వతేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగుతాయి. భక్తుల కోసం  విస్తృత సౌకర్యాలు కల్పిస్తున్నారు.ఉత్సవాల సందర్భంగా మార్చి 24వ తేదీ నుంచి ఉత్సవాలు మొదటి రోజైన 30వ తేదీ వరకు భక్తులందరికీ కూడా శ్రీస్వామివారి స్పర్శదర్శనం కల్పిస్తారు.ఉత్సవాలలో రెండో  రోజైన మార్చి 31వ తేదీ నుంచి ఏప్రియల్ 3వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే వుంటుంది.

ఈ ఓ  మాట్లాడుతూ  మహారాష్ట్ర, కర్ణాటక నుంచి విచ్చేసే భక్తులు సుమారు వారం రోజులు ముందుగానే 24వ తేదీ నుంచే క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉందన్నారు. అన్ని విభాగాల వారు సమన్వయముతో విధులు నిర్వహిస్తూ 24వ తేదీకంతా ఆయా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.  మార్చి 24 నుంచి 30 తేదీ వరకు మొత్తం మూడు క్యూలైన్లు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. వీటిలో ఒక క్యూలైన్ ఉచిత దర్శనానికి , రెండవ క్యూలైన్ రూ. 500/-లతో అతి శీఘ్రదర్శనానికి, మూడవ క్యూలైన్ ఆన్లైన్ ద్వారా ఉచిత దర్శనం రిజిప్టేషన్ చేయించుకున్న వారికి మరియు కంకణాలు ధరించిన పాదయాత్ర భక్తులకు కేటాయించాలన్నారు. అదేవిధంగా శ్రీవృద్ధమల్లికార్జున స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన, కల్యాణోత్సవం మొదలైన ఆర్జిత సేవా టికెట్లు పొందిన వారికి ప్రస్తుత ఆర్జితసేవ క్యూలైన్ల ద్వారానే ప్రవేశం కల్పించాలన్నారు.

మార్చి 31వ తేదీ నుంచి ఏప్రియల్ 3వ తేదీ వరకు నాలుగు క్యూలైన్లు ఉండాలన్నారు. వీటిలో ఒక క్యూలైన్ ఉచిత దర్శనానికి , రెండవ క్యూలైన్ రూ. 200/-ల శీఘ్రదర్శనానికి, మూడవ క్యూలైన్ రూ. 500/లతో అతిశీఘ్రదర్శనానికి, నాల్గవ క్యూలైన్ ఆన్లైన్ ద్వారా ఉచిత దర్శనం రిజిప్టేషన్ చేయించుకున్న వారికి మరియు కంకణాలు ధరించిన పాదయాత్ర భక్తులకు కేటాయించాలన్నారు.

మార్చి 31 నుంచి ఏప్రియల్ 3వ తేదీ వరకు శ్రీవృద్ధమల్లికార్జునస్వామివారికి అభిషేకాలు నిలుపుదల చేసిన కారణంగా అమ్మవారికి కుంకుమార్చన మరియు కల్యాణం టికెట్లు మాత్రమే ఇస్తారన్నారు ఈ ఓ. ఈ ఆర్జితసేవా భక్తులకు ప్రస్తుత ఆర్జిత సేవా క్యూలైన్ ద్వారానే ప్రవేశం కల్పించాలన్నారు.

భక్తులు టికెట్ల కోసం అధిక సమయం వేచి ఉండకుండా వుండేందుకుగాను ఈ నెల 24 తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మొత్తం 9 కౌంటర్లను భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు ఈ ఓ.క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లలో అవసరమైన చోట్ల ఏమైనా మరమ్మతులు ఉంటే రెండు రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు.క్యూ కాంప్లెక్స్ లోని మంచినీటి కుళాయిలు, వాష్బేసిన్లు అన్ని కూడా వినియోగానికి అందుబాటులో వుండే విధముగా చర్యలు చేపట్టలన్నారు.

 క్యూకాంప్లెక్స్ లోని అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. అన్ని శౌచాలయాలలో కూడా నిరంతరం నీటి సరఫరా ఉండే విధముగా చర్యలు చేపట్టలన్నారు.క్యూలైన్ ప్రవేశద్వారాల వద్ద, క్యూకాంప్లెక్స్ లోను అవసరమైన చోట్ల తెలుగు, ఆంగ్ల బాషతో పాటు కన్నడ భాషలలో కూడా సూచన బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి.మురళీ బాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధి కారులు ఎం.ఫణిధర ప్రసాద్, ఎం.హరిదాస్, అసిస్టెంట్ కమీషనర్ ( ఐ /సి),  సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజరావు, ఎడిటర్ డా .సి.అనిల్ కుమార్ , ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహారెడ్డి, పర్యవేక్షకులు శ్రీమతి సాయికుమారి, వెంకటేశ్వరావు సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు బి.శివారెడ్డి, పి.వి.సుబ్బారెడ్డి, విష్ణుబాబు, వెంకటేశ్వరావు, ముఖ్యభద్రతా అధికారి నరసింహారెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.