
శ్రీశైలదేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా ఈ రోజు (20.12.2021) కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పుష్కరిణి ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ పుష్కరిణి వద్ద భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేవిధంగా పలు చర్యలు చేపట్టాలని సూచించారు. సుందరీకరణ చర్యలలో భాగంగా మండపం ఏర్పాటుతో పాటు శివపార్వతుల విగ్రహాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.పుష్కరిణిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వుండేందుకుగాను పుష్కరిణి చుట్టు రక్షణ కటాంజనాలను ( సేఫ్టి గ్రిల్స్) ఏర్పాటు చేయాలన్నారు.ఆలయపుష్కరిణిలో నిరంతరం నీరు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పుష్కరిణిలోని జలం శుభ్రంగా వుండే విధంగాను, వినియోగపు నీరు వెలుపలకు వెళ్లేందుకు కూడా చర్యలు చేపట్టాలన్నారు.