
శ్రీశైలదేవస్థానం:ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు.గురువారం వివిధ పనులకు సంబంధించి ఆయా అంశాలను ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంతనాయక్, డా. శ్రీమతి కనకదుర్గ, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు పరిశీలించారు.
వీరివెంట దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి.రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు డి. నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏ/సి) చంద్రశేఖరశాస్త్రి, ఎలక్ట్రికల్ డీఈ మల్లికార్జున ప్రసాద్, డ్రాఫ్టుమెన్ సరేశ్వరుడు, ఏఈలు భవన్ కుమార్, ప్రణయ్, రంగప్రసాద్, రాజేష్ కుమార్, విష్ణు, వెంకటేశ్వరరావు, మేఘనాథ్ తదితరలు ఉన్నారు. .
ముఖ్యంగా పలుచోట్ల పార్కింగ్ ప్రదేశాలు, చలువ పందిర్లకు (షామియానాలకు) ప్రతిపాదించిన ఆరు బయలు ప్రదేశాలు మొదలైన వాటిని పరిశీలించారు.అదేవిధంగా శివదీక్షా భక్తులు జ్యోతిర్ముడిని సమర్పించే శివదీక్షా శిబిరాల ప్రాంగణాన్ని కూడా పరిశీలించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో పలు భక్త సంఘాల వారు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతారు. ఈ అన్నదానానికి ఆయా ప్రదేశాలలో దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తుంది. అన్నదానానికి ప్రతిపాదించిన ఆయా స్థలాలను ధర్మకర్తల మండలి సభ్యులు పరిశీలించారు.అదేవిధంగా ఆరుబయలు ప్రదేశాలలో తాత్కాలిక విద్యుద్దీకరణకు ప్రతిపాదించిన ప్రదేశాలను కూడా పరిశీలించారు.