డిసెంబరు చివరిలోగా ఫినిషింగ్ పనులు పూర్తి చేయాలి
శ్రీశైల దేవస్థానం: ధర్మకర్తలమండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి గురువారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంతా నాయక్, డా. సి. కనకదుర్గ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు పాల్గొన్నారు.పరిశీలనలో ముందుగా వారు లలితాంబికా వాణిజ్య సముదాయంలో నూతనంగా నిర్మించిన 36 దుకాణాలను పరిశీలించారు.తరువాత వారు గణేశసదనము నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ధర్మకర్తలమండలి అధ్యక్షులు, సభ్యులు మాట్లాడుతూ ఫినిషింగ్ పనులు మొదలైన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.డిసెంబరు చివరిలోగా ఈ పనులన్నింటిని పూర్తి చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా సముదాయ ప్రాంగణములో నాలుగువైపులా సీసీరోడ్లు, అదేవిధంగా నిర్మాణం చుట్టూ ప్రహరీగోడ నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రాంగణమంతా కూడా పచ్చదనం పెంపొందించే విధంగా ల్యాండ్ స్కేపింగ్ పనులను చేపట్టాలన్నారు. వసతి సముదాయ ప్రాంగణానికి సమీపంలోనే వీలైనంత మేరకు పార్కింగ్ ప్రదేశాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంచార్జి ( ఐ/సి) చంద్రశేఖరశాస్త్రి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు భవన్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీరు రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment