డార్మెటరీలకు అవసరమైన మరమ్మతులు చేయాలి-ఈ ఓ
శ్రీశైల దేవస్థానం:– పరిపాలనాంశాలలో పరిశీలనలో భాగంగా ఈ ఓ ఈ రోజు (02.10.2021) న టూరిస్ట్ బస్టాండ్ ,పాతాళగంగ రోడ్డు వద్ద ఉన్న డార్మెటరీలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం టూరిస్ట్ బస్టాండ్ వద్ద ఉన్న డార్మెటరీలకు మరమ్మతులు చేయాలన్నారు. ఎలక్ట్రికల్ పనులకు సంబందించిన పనులను కూడా చేయాలన్నారు.
డార్మెటరీల వద్ద ప్రజా సౌకర్యాల (శౌచాలయాలను) కు కూడా మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
తరువాత టూరిస్ట్ బస్టాండ్ వద్ద కర్ణాటక వారు విరాళంగా ఇచ్చిన బిల్డింగ్ కు సంబంధించి కూడా మరమ్మతులు, ఎలక్ట్రికల్ పనులు, ప్రహరిగోడ మరియు గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరికొన్ని శౌచలయాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు.
అనంతరం బయలు వీరభద్రస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయం చుట్టు ప్రహరిగోడకు అంచనాలను రూపొందించాలన్నారు.
పాతాళగంగరోడ్డు వెనుక భాగంలో ఉన్న డార్మెటరీలు , నీలకంఠేశ్వర డార్మెటరీలలో బంకర్ బెడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో సహాయ కార్యనిర్వహణాధికారులు డి.మల్లయ్య, పి.నటరాజ్, డిఈ శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షకులు డి. రాధకృష్ణ, జి. స్వాములు, అసిస్టెంట్ ఇంజనీరు సుబ్బారెడ్డి, రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment