×

డార్మిటరీలలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం-చక్రపాణి

డార్మిటరీలలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం-చక్రపాణి

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి శనివారం  క్షేత్రపరిధిలోని డార్మెటరీలను పరిశీలించారు.టూరిస్ట్ బస్టాండ్ వద్ద డార్మిటరీలు, పాతాళగంగమార్గంలోని నందీశ్వర డార్మిటరీ, పాతాళేశ్వర సదన్ సమీపంలో  నందికేశ సదనము డార్మెటరీలను పరిశీలించారు.

 ధర్మకర్తల మండలి అధ్యక్షుల  మాట్లాడుతూ డార్మిటరీల వద్ద  శౌచాలయాలు, స్నానపు గదులకు నిరంతరం నీటిసరఫరా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అవసరం మేరకు అన్ని డార్మిటరీలలో కూడా మరికొన్ని ఫ్యాన్లను ఏర్పాటు చేయాలన్నారు. ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా డార్మిటరీలలోని ఎలక్ట్రికల్ వైరునంతా తనిఖీ చేయాలని ఎలక్ట్రికల్ విభాగాన్ని సూచించారు. డార్మిటరీలలో పనిచేసే సిబ్బంది అంతా భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు.డార్మిటరీల ప్రాంగణాలు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఆయా చోట్ల మరిన్ని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. డార్మిటరీలలో పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తా చెదారాలను తొలగిస్తుండాలన్నారు.నందికేశసదనం డార్మిటరీ ప్రాంగణం వెనుకభాగంలో కూడా ప్రహరిగోడ నిర్మించేందుకు అంచనాలు రూపొందించి నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి.మురళీ బాలకృష్ణ, వసతివిభాగ సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఐ/సి) శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ ఇంజనీరు సీతారమేష్ తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed