శ్రీశైల దేవస్థానం:కొబ్బరికాయల నాణ్యత లో రాజీపడకూడదని ఈ ఓ ఆదేశించారు. శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఎస్ .లవన్న బుధవారం కొబ్బరికాయల గోడౌనును ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకు రిజిష్టరులో నమోదును, రోజువారి విక్రయవివరాలు, సిబ్బంది హాజరును మొదలైన వాటిని ఈ ఓ పరిశీలించారు. కొబ్బరికాయల సైజులను కూడా తనిఖీ చేశారు
భక్తుల రద్దీ కనుగుణంగా తగినంత స్టాకును ముందస్తుగానే సిద్ధంగా ఉంచుకోవాలని కొబ్బరికాయల గోడౌన్ అధికారులను ఈ ఓ ఆదేశించారు. సరఫరాను పొందేటప్పుడు తప్పనిసరిగా కొబ్బరికాయల నాణ్యతను పరిశీలించాలన్నారు. ఎట్టిపరిస్థితులలో కూడా నాణ్యత విషయం లో రాజీపడకూడదన్నారు. కొబ్బరికాయల విక్రయాల సందర్భంగా భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు.ఎవరైనా భక్తులు ఆలయవేళలు, ఆర్జితసేవలు మొదలైన సాధారణ సమాచారాన్ని అడిగినప్పుడు తగు సమాచారాన్ని వివరంగా తెలియజేయాలని సూచించారు.
